మంచిర్యాలఅర్బన్: విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. విద్యార్థులకు నవంబర్ 2నుంచి జనవరి 9వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. నవంబర్‌లో 29 రోజులు, డిసెంబర్‌లో 31రోజులు, జనవరిలో 9రో జులు తరగతులు ఉంటాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులు మినహాయించారు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల వెలుపల, వరండాల్లో కూర్చోబెట్టరాదని డీఈవో చంద్రయ్య ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 9నాటికి సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 281 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 10,363మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. 170 ప్రభుత్వ పాఠశాలల్లో 6,560మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరిలో 3,176 మంది బాలురు, 3,384 మంది బాలి కలు ఉన్నారు. పక్కా ప్రణాళికతో విద్యాశాఖ ప్రతీ రోజు సాయంత్రం 4.15గంటల నుంచి 5.15గంట ల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనుంది. మొదటి 20నిమిషాలు ఆ రోజు అంశంపై ముఖ్యమై న విషయాలు వివరించాలి. మిగతా 40నిమిషాలు విద్యార్థులతో సాధన చేయించాలి. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో సబ్జెక్టు చొప్పున వరుసగా తరగతులు జరుగుతాయి. సిలబస్‌లోని కీలకమైన చాప్టర్లు, క్లిష్టమైన విషయాలను వివరంగా బోధించి సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల అకాడమిక్ ప్రతిభను మెరుగుపరిచి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించా లి. ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపాలి. రోజు వారీ ప్రత్యేక తరగతుల రికార్డును నిర్వహించాలి.


