అడ్రియాల గనిలో సీఎంపీడీఐ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

అడ్రియాల గనిలో సీఎంపీడీఐ తనిఖీలు

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

రామగిరి: సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌ గనిని సెంట్రల్‌ మైన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎంపీడీఐ) జనరల్‌ మేనేజర్‌ శంభుశరణ్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం సందర్శించింది. సభ్యులు పమేంద్ర కుమార్‌సింగ్‌, పవన్‌కుమార్‌, రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్‌ గనిలోని నాలుగో ప్యానెల్‌లో ఏర్పాటు చేస్తున్న సపోర్టింగ్‌ చాక్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్యానెల్‌కు అనుమతుల మంజూరు ప్రక్రియలో భాగంగా తనిఖీ చేపట్టారు. గనిలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక ఏర్పాట్లు, సపోర్టింగ్‌ వ్యవస్థల పనితీరు పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు. అడ్రియాల ప్రాజెక్ట్‌ ఏరియా జనరల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు, భూగర్భ గనుల విభాగం జనరల్‌ మేనేజర్‌ యాదయ్య, ఎస్‌వోటూ జీఎం సత్యనారాయణ, ఏరియా ఇంజినీర్‌ దూప్‌ సింగ్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ జనార్దన్‌, ఇంజినీర్‌ బాలరా జు, మేనేజర్‌ పెంచలయ్య, జెన్‌కో అధికారులు నరసింహం, శ్రీధర్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement