మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన హస్వి మురికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా ఎట్ చాపెల్ హిల్ (యూఎన్సీ)లో మోర్ హెడ్ కెయిన్ స్కాలర్‌గా ఎంపికై నట్లు ఆమె తల్లిదండ్రులు సత్యనారాయణ, మాధవి తెలిపారు. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక మెరిట్ స్కాలర్షిప్ కార్యక్రమంలో మోర్హెడ్–కెయిన్ ఒకటి కాగా, ఈ ఏడాది సోఫోమోర్ సెలక్షన్ ద్వారా 18మంది విద్యార్థులు ఎంపిక కాగా, భారత దేశం నుంచి ఎంపికై న ఏకై క విద్యార్థిగా ఆమె నిలిచారు. హస్వి అమెరికాలో ఎకనామిక్స్, డేటా సైన్స్ చదువుతుండగా, ఎంటర్ ప్రెన్యూర్షిప్ ఆమె మైనర్ సబ్జెక్టు. అనాథ, గిరిజన పిల్లలకు విద్యావకాశాలను అందించేందుకు ‘సమున్నతి’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించడంతో పాటు గట్ఈజ్ అనే ధరించగలిగే చికిత్సా పరికరాన్ని రూపొందించారు. ప్రపంచ రికార్డు సాధించిన పర్వతారోహకురాలిగా గుర్తింపు పొందగా, స్పోర్ట్స్‌లోనూ రాణిస్తున్నారు.


