అవినీతిపై విజి‘లెన్స్‌’ | - | Sakshi
Sakshi News home page

అవినీతిపై విజి‘లెన్స్‌’

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

త్రిముఖ వ్యూహం అమలు పెరుగుతున్న ఫిర్యాదులు విజిలెన్స్‌పైనా ఆరోపణలు గనులపై కొనసాగుతున్న అవగాహన వారోత్సవాలు

శ్రీరాంపూర్‌: సింగరేణిలో అవినీతి, అక్రమాలకు వి జిలెన్స్‌ విభాగం అడ్డుకట్ట వేస్తోంది. సంస్థలో ఎంతో కీలకంగా ఉన్న ఈ విభాగం మున్ముందు మరి న్ని సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సి ఉంది. విజిలెన్స్‌ ప్రాముఖ్యతను చాటుతూ ఈ ఏడాది నిజాయితీ–సమృద్ధి నినాదంతో గనులు, డిపార్ట్‌మెంట్లపై అధికారులు ఈ నెల 26నుంచి నవంబర్‌ 1వరకు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నా రు. సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలతో ఉన్నత వి ద్యావంతులు ఎక్కువ కాగా, ఫిర్యాదుల సంఖ్య పె రిగింది. కంపెనీకి ప్రయోజనం కంటే వ్య క్తిగత వైషమ్యాలు, కక్ష పూర్వకమైన ఫిర్యాదులు ఇటీవల ఎ క్కువగా వస్తున్నాయి. గతేడాది సుమారు 211 ఫి ర్యాదులు ఇలాంటివి వచ్చాయి. విజిలెన్స్‌ శాఖకు ఫి ర్యాదు చేయాలంటే తప్పనిసరిగా సరైన వివరాలు, చిరునామా, ఫోన్‌ నంబర్లుండాలి. ఫిర్యాదుదారుల పేర్లు కొన్ని సందర్భాల్లో గోప్యంగా ఉంచుతారు. గతేడాది సరైన చిరునామా, అసంపూర్తిగా ఉండడంతో సుమారు 96 ఫిర్యాదులు పక్కన పెట్టారు.

10 మంది డిస్మిస్‌

సింగరేణిలో ఎక్కువగా కారుణ్య ఉద్యోగాల్లో అవినీ తి జరుగుతోందనే ఆరోపణలున్నా అధికారులు ట్టి పారేస్తున్నారు. ఇప్పటివరకు మెడికల్‌ బోర్డులో అన్‌ఫిట్‌ చేయిస్తామని డబ్బులు వసూలు చేయడం, తప్పుడు పత్రాలు సృష్టించిన కేసుల్లో విచారణ చేసి 10మంది కంపెనీ ఉద్యోగులను డిస్మిస్‌ చేశారు. మరికొందరు దళారులపై సివిల్‌ పోలీసు కేసులు నమోదు చేయించినట్లు అధికారులు తెలిపారు.

త్రిముఖ వ్యూహంతో..

అవినీతిని కరికట్టడం, పరిపాలన పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడం కోసం విజిలెన్స్‌ విభాగం త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది.

నిర్మాణాత్మక విజిలెన్స్‌: అవినీతి, అక్రమాలు ఎక్క డ జరిగే అవకాశం ఉందో అక్కడ ముందే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార దుర్వినియోగం కాకుండా లోపాలు సరిచేస్తున్నారు.

భాగస్వామ్య విజిలెన్స్‌: ప్రతీ ఉద్యోగి తన విధులను చిత్తశుద్ధి, నిజాయితీతో నిర్వహించడమే కాకుండా తన చుట్టూ జరిగే అవినీతి, అక్రమాలు అధికార దుర్వినియోగంపై స్పందించి సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు అందేలా చూస్తున్నారు. ఈ దిశగా విజిలెన్స్‌ అధికారులు తమకున్న వేగులతో ఈ పనులు చేయిస్తున్నారు.

శిక్షాపరమైన విజిలెన్స్‌: అవినీతి, అక్రమాలు, అధి కార దుర్వినియోగానికి పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి విచారణ చేసి వారిపై నిర్ణీత కాలవ్యవధిలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇతరులెవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా కేసులను లోతుగా దర్యా ప్తు చేసి శిక్షలు వేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

కింది స్థాయిలోనే చర్యలా?

విజిలెన్స్‌ విభాగంపైనా ఆరోపణలున్నాయి. కొన్ని కేసుల్లో కింది స్థాయి ఉద్యోగులు, అధికారులపై చ ర్యలు తీసుకుంటూ పైస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దురుద్దేశ పూర్వకంగా విధానపర నిర్ణయాలతో కంపెనీకి నష్టం చేస్తే ఉ న్నత స్థాయి అధికారులపై చర్యలు ఉండటం లే దని, నాసిరకం పనిముట్లు, ఓబీ కాంట్రాక్టర్ల మా యాజాలం, యంత్ర పరికరాల కొనుగోళ్లలో అవినీ తిపై లోతైన దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో సింగరేణిని రక్షించుకోవాలంటే రాజకీయ జోక్యంతో జరిగే అధికార దుర్వినియో గం, డబ్బుల దుబారాపై విజిలెన్స్‌ జోక్యం చేసుకోవా లని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. దీని కోసం విజిలెన్స్‌ విభాగానికి మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అసవరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement