తాండూర్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మండలంలోని రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని గిరుగుల అక్షర ఎంపికై నట్లు పీడీ సంతోష్‌కుమార్ తెలిపారు. అక్షర ఈ నెల 29నుంచి 31వ తేదీ వరకు మేడ్చల్‌లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననుందని పేర్కొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్, సర్పంచ్ రాంబాయి ఆకాంక్షించారు.
లక్సెట్టిపేట: మండలంలోని జెండావెంకటాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దేవహర్ష రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు యశోదర తెలిపారు. ఈనెల 4వ తేదీన బెల్లంపల్లిలో నిర్వహించిన అండర్–14 విభాగం నుంచి జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీన మేడ్చల్‌లో నిర్వహించనున్న పోటీల్లో దేవహర్ష పాల్గొంటాడని తెలిపారు. విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.


