మంచిర్యాలరూరల్(హాజీపూర్): పండుగలు, సంతోషాలు వదిలి నిత్యం విధుల్లో ఉండే వారితోపాటు విధుల్లో అమరులవుతున్న పోలీస్‌ల త్యాగాలు వెలకట్టలేనివని గుడిపేట 13వ ప్రత్యేక పోలీసు బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బెటాలియన్ ఆవరణలో కమాండెంట్ వెంకటేశ్వర్లు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. గుడిపేట గ్రామ, జాతీయ రహదారులపై మంచిర్యాల ఐబీ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా నుంచి నగర పుర వీధుల గుండా ఐబీ వరకు ర్యాలీ సాగింది. అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ బైక్ ర్యాలీ చేపట్టి ఘన నివాళులు అర్పించారు. అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, ఆంజనేయరెడ్డి, వీరరాజు, హాజీపూర్ ఏఎస్సైలు చాంద్‌పాషా, పెద్దిరెడ్డి, ఆర్‌ఐలు, ఏఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


