తాండూర్: మండలంలోని అచ్చలాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చౌళ్ల హర్షిత రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పీడీ సాంబమూర్తి తెలిపా రు. ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జోనల్ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ కై వసం చేసుకుంది. అత్యుత్తమ ప్రతిభకనబర్చిన చౌళ్ల హర్షిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. నవంబర్‌లో మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. పాఠశాల హెచ్‌ఎం ఉమాదేవి, సర్పంచ్ మారి శెట్టి స్రవంతి, ఉపసర్పంచ్ గట్టు సంతోష్‌కుమార్, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా హర్షితను అభినందించారు.


