ఆదిలాబాద్‌టౌన్: వాట్సాప్ ద్వారా నకిలీ లింక్‌లు పంపిస్తూ బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్‌కార్డుల నుంచి రూ.4,20,210 కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలి పారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. బేల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాంగిడి గ్రామానికి చెంది న అనురాగ్‌రెడ్డికి గుర్తుతెలియని నంబర్ నుంచి వా ట్సాప్‌లో వచ్చిన ఓ లింక్‌ను ఓపెన్ చేయగా ఫోన్‌పే ద్వారా రూ.2,200 చెల్లించాలనే సందేశం కనిపించింది. అది నిజమని నమ్మి డబ్బులు చెల్లించాడు. అనంతరం అతని క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఖాతాల నుంచి 16 లావాదేవీల ద్వారా మొత్తం రూ.4,20,210 కట్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో బేల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. సెల్‌నంబర్లు, ఆన్‌లైన్ లావాదేవీ లు, సాంకేతిక ఆధారాలతో రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ జిల్లా దగర్ గ్రామానికి చెందిన దినేష్ పటేల్ ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీ సుకున్నారు. అతని నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక మినీ ఐప్యాడ్, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మోసపోయిన బాధితుడికి కోర్టు ద్వారా రూ.2 లక్షలను తిరిగి అందించినట్లు ఎస్పీ తెలిపారు.
సైబర్‌నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్‌నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అపరిచితులు పంపే వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ లింక్‌లు ఓపెన్ చేయొద్దని, బ్యాంక్ ఖా తాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, ఓటీపీల ను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి, సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు, www.cybe rcrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యా దు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆదిలా బాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ జి.శ్రావణ్ కుమార్, బేల ఎస్సై మధుకృష్ణ, సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్సై గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 220, తెలంగాణలో 20 కేసులు
నిందితుడు ఇతరుల గుర్తింపు పత్రాలతో సిమ్‌కార్డులు సేకరించేవాడని విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ ఎస్కార్ట్, కాల్‌గర్ల్ సేవల వెబ్‌సైట్ లింక్‌లు ప్రచారం చేసి, వాటిని నమ్మి సంప్రదించిన వారితో టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా మాట్లాడేవాడని, వివిధ రకాల సేవలందిస్తామని చెప్పి ముందుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ డబ్బులను ఇతరుల బ్యాంక్‌ఖాతాల ద్వారా మళ్లిస్తూ క్రెడిట్‌కార్డుల ద్వారా చెల్లించిన సందర్భాల్లో ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికల నుంచి గిఫ్ట్‌కార్డులు కొనుగోలు చేసి వస్తువులు పొందేవాడని తెలిపారు. దేశవ్యాప్తంగా నిందితుడిపై 220, తెలంగాణలో 20 కేసులు నమోదైనట్లు వివరించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, వనస్థలిపురం, నార్సింగి పోలీస్‌స్టేషన్ల పరిధిలో మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.


