శ్రీరాంపూర్: ప్రతీ ఉద్యోగి, అధి కారి విధి నిర్వహణలో నిజాయితీగా పనిచేయాలని శ్రీరాంపూర్ ఏరియా ఇన్‌చార్జి జీఎం ఏవీ రెడ్డి తెలిపారు. విజిలెన్స్ వారో త్సవాల్లో భాగంగా సోమవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో విజిలెన్స్‌పై అవగాహ న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంవత్సరం సంస్థలో ’నిజాయితీతో సంవృద్ధి’అనే నినాదంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాలు నవంబర్ 1 వరకు కొసాగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా పనిచేయాలన్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఏరియా ఎస్‌ఓటూ జీఎం కృష్ణప్రసాద్, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, అధికారుల సంఘం ప్రతినిధి పద్మ, ఏజీఎం(ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎం(ఐఈడీ) రాజన్న, లా ఆఫీసర్ మల్లేశ్, పర్చేస్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జీఎం ఆఫీస్ ఆవరణలో..
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని జీఎం ఆఫీస్ ఆవరణలో సోమవారం విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా ఎస్వో టూ జీఎం లలితేంద్రప్రసాద్ హాజరై ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఏరియా డీజీఎం(పర్సనల్) అశోక్, ఆఫీస్ సూపరింటెండెంట్ రాజలింగు, సీనియర్ పీవో సత్యనారాయణ, ఏఐటీయూఏసీ బ్రాంచి కార్యదర్శి సత్యనారాయణ, మల్లేశ్, అధికారులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.


