మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ మహర్షి వాల్మీకి చరిత్ర, ఆయన రచించిన రామాయణం ప్రపంచం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) కే.శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు గోపి, రాజేంద్రప్రసాద్, చంద్రశేఖర్‌గౌడ్, శ్రీనివాస్, ఆర్‌ఐలు దామోదర్, శేఖర్, రమేష్, సీసీ సందీప్, ఎస్సైలు ఉపేందర్, సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
స్మగ్లింగ్‌కు పాల్పడిన ఒకరి రిమాండ్
జన్నారం: బైక్‌పై టేకు దుంగలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు తాళ్లపేట రేంజ్ అధికారి వికాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..జన్నారం అటవీ డివిజన్ తాళ్లపేట రేంజ్ పరిధిలో తాళ్లపేటకు చెందిన గోపతి అంజన్న, ఈనెల 24న బైక్‌పై టేకు దుంగలను తరలిస్తుండగా డీఆర్వో సాగరిక, బీట్ అధికారులు రహీమోద్దీన్, పద్మజరాణి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.


