చెన్నూర్‌రూరల్: మండలంలోని సుబ్బరాంపల్లిలో గ్రామోద్యోగు వికాస్‌లో భాగంగా కుమ్మరులకు కుమ్మరి సారె నైపుణ్యాభివృద్ధి శిక్షణ సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి టెక్నీషియన్ డైరెక్టర్ సంజీవరావు హాజరై మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా ఎలక్ట్రికల్ వీల్స్ అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, శ్రీనివాస్, కత్తెరసాల సర్పంచ్ చేతెల్లి పద్మ, మోహన్‌రెడ్డి, కుమ్మరి సంఘం జిల్లా అద్యక్షుడు గంగాధరి తిరుపతి, రాష్ట్ర ఉపాద్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సలిగంటి చంద్రయ్య, జిల్లా నాయకులు శనిగారపు తిరుపతి, అక్కెపల్లి గ్రామ ఉప సర్పంచ్ రాతిపల్లి రమేష్, కత్తెరసాల ఉప సర్పంచ్ రాతిపల్లి మల్లేష్, మాస్టర్ ట్రైనర్ రాతిపల్లి నగేష్ పాల్గొన్నారు.


