బెల్లంపల్లి: రైల్వే ర న్నింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని హ్యాండిక్యాప్డ్, పైలట్ సెక్షన్లకు ఆ మోదం కల్పించాలని డిమాండ్ చేస్తూ ద. మ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ ఆఽ ద్వర్యంలో సోమవా రం నిర్వహించిన ని రాహార దీక్షకు బెల్లంపల్లి నుంచి రైల్వే కా ర్మికులకు తరలివెళ్లారు. సికింద్రాబాద్‌లోని సంచలన్ భవన్ వద్ద ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష నిర్వహించారు. మజ్దూర్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, రైల్వే కార్మికులు హాజరై సంఘీభావం ప్రకటించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ జనరల్ సెక్రెటరీ సీహెచ్.శంకర్రావు, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ పి.రవీందర్, అధ్యక్షుడు ఖాజాబాబా, బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ సాంబశివుడు పాల్గొన్నారు.


