మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలి

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

మంచిర్యాలటౌన్‌: ప్రధాని మోదీ ‘నషా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌’పేరుతో వంద వారాల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆదేశాలతో మాదక ద్రవ్యాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని రెడ్‌క్రాస్‌ సభ్యులు కోరారు. సోమవారం అదనపు కలెక్టర్‌ చంద్రయ్యకు రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. విద్యాసంస్థలు, ఎన్జీవోలు, ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని కోరారు. డ్రగ్స్‌ బారినపడిన వారికి కౌన్సెలింగ్‌, వైద్యపరీక్షలు, డీ అడిక్షన్‌ కేంద్రాల ద్వారా మెరుగైన చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఈనెల 28న హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్‌ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, జిల్లాలో నవంబర్‌ 14వ తేదీ వరకు అవగాహన సదస్సులు, ర్యాలీలు, రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement