మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా సమీకృత కలెక్టరేట్ అవరణలో వాహనాలు ఎండకు ఎండుతూ, వానాకు తడుస్తున్నాయి. అదే పక్కజిల్లా ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో మాత్రం షెడ్డు నీడలో ఉంటున్నాయి. జిల్లా అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోటలో ఉండేలా సమీకృత కలెక్టరేట్ నిర్మించారు. కాని వాహనాలకు షెడ్డు నీడ మాత్రం ఏర్పాటు చేయలేదు. ఉద్యోగుల ద్విచక్రవాహనాలు, కార్లు వానొస్తే తడుస్తూ, ఎండలో గంటల తరబడి ఉంటున్నాయి. కార్యాలయాలకు వచ్చే ప్రజల వాహనాల పరిస్థితి అలాగే ఉంది. ఎండకు పదుల సంఖ్యలో వాహనాలు పాడైపోతున్నాయని, పెట్రోల్ అవిరి అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.


