మండే ఎండ.. గొడుగే అండ | - | Sakshi
Sakshi News home page

మండే ఎండ.. గొడుగే అండ

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: మండే ఎండలో సీతఫలానికి కొంగు నీడ, గొడుగునీడే అండగా మారింది. జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలు నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో జనం బయటకు వెళ్లలేని పరిస్థితి. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో జగిత్యాల, పెద్దపెల్లి జిల్లా నుంచి వ్యాపారులు సీతఫలాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పండ్లు, కాయలు పాడవకుండా గొడుగులు, కొంగునీడ, తడిగుడ్డలు వేసుకుని కాపాడుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో గిరాకీ ఉంటుందని, రెండు, మూడు రోజులు ఎండ తీవ్రతతో కాయలు నలుపు రంగులోకి మారిపోతున్నాయని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement