మంచిర్యాలఅర్బన్: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్‌లో అండర్–17 బాలబాలికల ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 300 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ సల్ల రమ్య క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ యాకూబ్, నిర్మల్ జిల్లా సెక్రటరీ లక్ష్మణ్, పెటా టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజయ్య, శ్రీనివాస్, నిర్వాహక కార్యదర్శులు రవీందర్, సామిత్, వైస్ ప్రిన్సిపాల్ బిజుకురువిల్లా, తదితరులు పాల్గొన్నారు.


