పాతమంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 30న నిర్వహించనున్న పాంచజన్య సంకల్పసభకు అధికసంఖ్యలో తరలిరావాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఉదారి చంద్రమోహన్‌గౌడ్ పిలుపు నిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పాంచజన్య సంకల్ప సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి ఇన్‌చార్జి బోడ జనార్దన్, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి తిప్పర్తి సారన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, యువజన అధ్యక్షుడు ఐత ప్రశాంత్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పొలసాని హారికారావు, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.


