ఉన్న ఊరిలో ఉపాధి లేక.. తమ బంధువులు ఉంటున్న కోల్‌బెల్ట్ ఏరియాలో బతుకుదెరువు వెతుక్కుందామని వచ్చిన ఓ కుటుంబంలో ముగ్గురిని నీటికుంట మృత్యువై కబళించింది. ఉపాధి కోసం వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే వలస కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పున్నంకుంట చెరువు సమీపంలోని నీటి కుంట వద్దకు బట్టలు ఉతుక్కునేందుకు వెళ్లిన మోటం మనియమ్మ(24), మోటం కీర్తన(16), మదేని కావ్య(10) ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. దీంతో వలస జీవుల రోదనలు మిన్నంటాయి. – జైపూర్
వివరాలు మెయిన్‌లో..
మృతుల కుటుంబాలకు ఎంపీ పరామర్శ
జైపూర్: మండలంలోని ఇందారంలో ఆదివారం నీటి గుంతలో పడి ముగ్గురు వలస కూలీలు మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రమాదకర గుంతలు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


