ముదిరాజ్‌లు అన్నిరంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లు అన్నిరంగాల్లో రాణించాలి

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ముదిరాజ్‌లు అన్నిరంగాల్లో రాణించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లాలో ముదిరాజ్‌ భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు తన ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లి పద్మావతి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ముదిరాజ్‌ సింహగర్జన సభలో ఆయన మాట్లాడుతూ ముదిరా జ్‌ సమాజ అభివృద్ధికి తనవంతు సహకారం అంది స్తానన్నారు. మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ ముదిరాజ్‌ భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపు త్వరితగతిన జరిగేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షు డు బండ ప్రకాశ్‌, జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, ముదిరాజ్‌ కులబాంధవులు పాల్గొన్నారు.

మంత్రి, ఎంపీ పరామర్శ

కాసిపేట: మండల కేంద్రానికి చెందిన సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ పూస్కూరి వంశీకృష్ణరావు తల్లి రేఖారాణి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఆదివారం మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి ప్రగాడ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement