మంచిర్యాలటౌన్: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మంత్రి వివేక్ వర్గీయుల మధ్య జరుగుతున్న దాడులతో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, వ్యాపారులపై దాడులు జరుగుతున్నా సీఎం, పోలీస్ యంత్రాంగం పట్టించుకోలేదన్నారు. కనీసం ప్రజాప్రతినిధి కూడా కాని వ్యక్తికి వారం రోజులుగా 300ల మంది పోలీస్ బలగాలతో ఎవరి అండతో రక్షణ ఏర్పాటు చేశారో ముఖ్యమంత్రి జవాబు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండతోనే మంచిర్యాల ఎమ్మెల్యే అరాచకాలు సృష్టిస్తున్నారని, ఎమ్మెల్యేతో పాటు, దాడికి పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ పాల్గొన్నారు.


