కాంగ్రెస్‌ గ్రూపు గొడవలు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గ్రూపు గొడవలు అరికట్టాలి

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గ్రూపు గొడవలను అరికట్టి శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరుతూ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి శనివారం హైదరాబాద్‌లో కాళేశ్వరం మల్టీజోన్‌–1 ఐజీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొద్దిరోజులుగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మంత్రి గడ్డం వివేక్‌ కాంగ్రెస్‌లో వర్గాలుగా ఏర్పడి నియోజకవర్గంలో అలజడులకు కారణమవుతున్నారని ఆరోపించారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న కాంగ్రెస్‌ నాయకులపై చ ర్యలు తీసుకోవాలని, జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. బతుకమ్మ పండుగ రోజు న దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో జరిగిన గొడవ, దసరా రోజున లింగాపూర్‌లో జరిగిన ఘటనతో జిల్లాలో పోలీస్‌ పహారాను పెంచి ప్రజలకు ఇబ్బందులు సృష్టించారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ గాజుల ముఖేశ్‌గౌడ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement