బొగ్గుగని వార్తలు
శ్రీరాంపూర్: ఖాదీ దుస్తులను ధరించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. నస్పూర్ కాలనీలోని మనోరంజన్ సముదాయంలో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఖాదీ మేళా ఏర్పాటు చేశారు. జీఎం మాట్లాడుతూ ఖాదీ వస్త్రాలపై ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నారన్నారు. సింగరేణి ఉద్యోగులు వాయిదా పద్ధతిలో వస్త్రాలు కొనుగోలు చేసుకోవచ్చన్నా రు. వీటిని కార్మికుల వేతనాల్లోంచి ఐదు వాయిదా లలో చెల్లించే వీలు కల్పించామన్నారు. డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, డీవైపీఎం కే క్రాంతి కుమార్, నిర్వాహకులు రాజేశ్, రామ్రాజ్ పాల్గొన్నారు.


