కౌటాల: ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలని కోరుతూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయగా నమోదైన కేసులో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు శనివారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. 2018 జులై 8న ఎమ్మెల్యే హరీశ్‌బాబు, నైనాల గోవర్థన్, కె.వి ప్రతాప్, ఇతర నాయకులు కౌటాల మండలంలోని తుమ్మిడిహేటి వద్ద ప్రాణహిత నదిలో నిరసన తెలిపారు. ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మించడంలో అప్పటి ప్రభుత్వ తీరును నిరసిస్తూ పిండ ప్రదానం చేశారు. కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో అప్పటి ఏఎస్సై హన్మాండ్లు ఫిర్యాదుతో కౌటాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణలో భాగంగా శనివారం హియరింగ్‌కు హాజరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.


