స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కొనసాగించాలి

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

● నేటితో ముగియనున్న బతుకమ్మ ప్రత్యేక రైలు

కాగజ్‌నగర్‌టౌన్‌: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య ఈ నెల 9 నుంచి నడుపుతున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు (07711/12) సేవలు నేటితో ముగియనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ ఎగువ, దిగువ మార్గాల్లో 34 ట్రిప్పులు పూ ర్తికానున్నాయి. సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య నడిచిన ఈ రైలుకు విశేష స్పందన లభించింది. మధ్యాహ్న సమయంలో కాజీపేట్‌–కాగజ్‌నగర్‌ మార్గంలో రైళ్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ సమయంలో సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు తర్వాత మరో రైలు లేదు. మధ్యలో నాగ్‌ఫూర్‌ వందేభారత్‌ రైలు ఉన్నప్పటికీ టికెట్‌ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు, వి ద్యార్థులు, ఉద్యోగులు దీనిని ఆశ్రయించడంలేదు. కాజీపేట్‌ నుంచి మధ్యాహ్నం 2:30నుంచి 3 గంటల మధ్య బయలుదేరే బతుకమ్మ స్పెషల్‌ రైలుతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రయాణికులకు వరంగా మారింది.

బస్సు కన్నా చౌక.. వేగం..

పెద్దపల్లి నుంచి కాగజ్‌నగర్‌కు బస్సులో వెళ్తే 3:30 గంటలు పడుతుంది. చార్జీ రూ.200 పైనే అవుతాయి. అదే ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అయితే కేవలం గంటన్నరలోనే కాగజ్‌నగర్‌కు చేరుకోవచ్చు. చార్జీ కూడా కేవలం రూ.64 మాత్రమే.అందుకే వరంగల్‌, కాజీపేట్‌ నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ వెళ్ళే ప్రయాణికులు ఈ రైలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రద్దీని, ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెషల్‌ రైలును శాశ్వతంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రెగ్యులర్‌గా కొనసాగించాలి

దసరా, బతుకమ్మ పండుగలకు ప్రత్యేక రైలును రెగ్యులర్‌గా కొనసాగించాలి. మధ్యాహ్నం కాజీపేట నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి నుంచి ప్రతీరోజు ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది.

– జాన్‌వెస్లీ, పెద్దపల్లి,

ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యుడు

రేక్‌ షేరింగ్‌ తొలగించాలి

ప్రత్యేక రైలును బీదర్‌ వెళ్లే ఇంటర్‌ సిటీతో రేక్‌ షేరింగ్‌ తొలగించాలి. రేక్‌షేరింగ్‌ కారణంగా ఇంటర్‌ సిటీ ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలును ప్రతీ రోజు నడిపించి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గేడ్ర్‌ చేయాలి.

– విఘ్నేష్‌, మంచిర్యాల,

ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement