మంచిర్యాలరూరల్(హాజీపూర్): కర్ణమామిడిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, దొనబండలో ఎస్సీ బాలుర హాస్టల్, ముల్కల్లల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాల, నంనూర్లోని అర్బన్ గురుకుల పాఠశాల, గుడిపేటలోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలను శుక్రవారం డీఆర్డీవో కిషన్ తనిఖీ చేశారు. వసతులు, తరగతుల శుభ్రత పరిశీలించడంతోపాటు వంట గదులు, విద్యార్థుల భోజన నాణ్యతా వివరాలను ఆరా తీశారు. గుడిపేటలో వీబీజీ–రామ్జీ పథకంలో భాగంగా చేపడుతున్న జలసిరి పనులు, దొనబండలో వీఓ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఏపీవో మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు నరేందర్, శ్వేత, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు ఉన్నారు.


