పోలీస్‌ సిబ్బందికి వ్యాసరచన పోటీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ సిబ్బందికి వ్యాసరచన పోటీలు

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

నస్పూర్‌: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. శుక్రవారం కమిషనరేట్‌ కార్యాలయంలో అదనపు డీసీపీ(పరిపాలన) కే.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ గోపి ఆధ్వర్యంలో ‘పౌరుల నుంచి గౌరవం, ఆదరణ, సద్భావన పొందేందుకు పోలీసులు ఎలాంటి కృషి చేయాలి, క్షేత్రస్థాయిలో పోలీసింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఎలా’ అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యం, సామాజిక బాధ్యత, ప్రజాసేవపై నిబద్ధతను పెంపొందించడంతోపాటు ప్రజానుకూల పోలీసింగ్‌పై అవగాహన కల్పించడమే ఈ పోటీల ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్‌ పరిధిలోని పలువురు ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement