మంచిర్యాలటౌన్: ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అందరికీ అందుబాటులో ఉండేలా మంచిర్యాల నగరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో పరికరాలు విరిగిపోయాయి. దీంతో ప్రజలు వ్యాయామం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్‌ల్లోని పరికరాల్లో కొన్ని చోరీకి గురవుతున్నాయి. మరికొన్నింటిని ఆకతాయిలు విరగ్గొడుతున్నారు. ప్రజలు ఆహ్లాదంగా, ప్రశాంత వాతావరణంలో వ్యాయం చేసేలా బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్‌జిమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిని భద్రంగా చూడాల్సిన బాధ్యతను మున్సిపల్ కార్పొరేసన్ అధికారులు విస్మరించారు. ఫలితంగా రూ.లక్షల విలువైన పరికరాలు పనికి రాకుండా పోతున్నాయి. పరికరాల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరమ్మతు చేయకపోవడం, చోరీకి గురైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుకు నెలల తరబడి సమయం పడుతోంది. అప్పటి ప్రజలు వ్యాయామానికి దూరం కావాల్సి వస్తోంది.


