నిర్వహణ లోపం | - | Sakshi
Sakshi News home page

నిర్వహణ లోపం

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

● కేసీఆర్‌ పార్క్‌ ఓపెన్‌ జిమ్‌ ఉపయోగంలోకి రాకుండా పోయింది. పార్క్‌ను సాయంత్రం 5 గంటలకు తెరిచి 8, 9 గంటలకు మూసి వేస్తున్నారు. ఉదయం తీయడం లేదు. దీంతో ఓపెన్‌ జిమ్‌ అలంకార ప్రాయంగా మారింది. పరికరాలను బాగు చేయించి కేసీఆర్‌ పార్క్‌ను ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

చెన్నూర్‌: చెన్నూర్‌ మున్సిపాలిటీలో విద్యార్థులు, యువకులు, వాకర్స్‌ వ్యాయామం కోసం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం, కేసీఆర్‌ పార్క్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ సమీపంలో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేశారు. మూడేళ్లు కావస్తుండగా.. నిర్వహణలోపంతో పరికరాలు ఊడిపోతున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓపెన్‌ జిమ్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు వ్యాయామం చేస్తుంటారు. కాళ్లు స్ట్రెచ్‌ చేసే పరికరం ఊడిపోయింది. మరో పరికరం వీల్స్‌ ఊడిపోతుండగా విద్యార్థులు తాళ్లతో కట్టారు.

మరమ్మతు చేయిస్తాం

నెల రోజుల క్రితమే ఓపెన్‌ జిమ్‌లను బాగు చేయించా. మళ్లీ ఊడిపోయిన విషయం తెలియదు. మున్సిపల్‌ సిబ్బందిని పంపించి ఊడిపోయిన పరికరాలు బాగు చేయిస్తా. విద్యార్థులు, యువకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపడుతా.

– మారుతిప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చెన్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement