పర్యవేక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ కరువు

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

● ఏఎంసీ క్రీడా మైదానం, తిలక్‌ స్టేడియంలో ఓపెన్‌ జిమ్‌లో రాత్రివేళ మందుబాబులు గంటలపాటు మకాం వేస్తున్నారు. ● పోచమ్మ చెరువు కట్ట కింద ఉన్న జిమ్‌ రేయింబవళ్లు గంజాయిరాయుళ్లకు నిలయమైంది. దర్జాగా జిమ్‌ పరికరాలపై కూర్చుకుని గంజాయి దమ్ము కొట్టడం సర్వసాధారణంగా మారింది.

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓపెన్‌ జిమ్‌ల నిర్వహణ లోపించింది. పర్యవేక్షణ లేకపోవడంతో పరికరాలు ఆకతాయిల చేష్టలకు పాడవుతున్నాయి. రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. సింగరేణి తిలక్‌ స్టేడియం, పోచమ్మ చెరువు కట్ట కింద, అంబేద్కర్‌ నగర్‌, ఏఎంసీ క్రీడా మైదానం, 65 ఏరియా, రైల్వేస్టేషన్‌ ఏరియా తదితర ప్రాంతాల్లో ఓపెన్‌ జిమ్‌లు ఉన్నాయి. వీటిని నిర్వహణను మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. పరికరాలు రాపిడికి గురి కాకుండా గ్రీస్‌ ఎప్పటికప్పుడు పెట్టించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాకర్స్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement