మందమర్రిరూరల్: పట్టణంలోని పిల్లలందరికీ క్యాచప్ వ్యాక్సినేషన్లో భాగంగా ఈ నెల 31వరకు టీకాలు ఇప్పించాలని డీఎంహెచ్వో నరేందర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఊరుమందమర్రిలోని ఆయుష్మాన్ వైద్య ఉపకేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్తో కలిసి ఆకస్మికంగా సందర్శంచి రికార్డులు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొత్తగా వచ్చిన, తప్పిపోయిన పిల్లలను గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వాలని, వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. కుష్ఠువ్యాది నివారణ కోసం ప్రతీ ఇంటికి తిరిగి వివరాలు సేకరించాలని, దగ్గు, జలుబు, జ్వరం, దోమల ద్వార సంక్రమించే డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యసిబ్బంది, ఆశ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


