ప్రాణదాతలుగా ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాణదాతలుగా ముందుకు రావాలి

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): పోలీసులు ఆపద సమయంలోనూ ప్రాణదాతలుగా నిలిచి ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ముందుకు రావాలని గుడిపేట 13వ బెటాలియన్‌ కమాండెంట్‌ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌లో పోలీస్‌ అమర వీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్‌ అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. వెంకటేశ్వర్లు స్వయంగా రక్తదానం చేసి బెటాలియన్‌ సిబ్బందిలో స్ఫూర్తి నింపారు. కమాండెంట్‌ మాట్లాడుతూ జిల్లాలో తలసేమియా, రక్తహీనతతోపాటు వివిధ ప్ర మాదాల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో అందక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రక్తదాతలకు ప్రోత్సాహక సర్టిఫికేట్లు అందజేశారు. బెటాలియన్‌ యూనిట్‌ మెడికల్‌ అధికా రి సంతోష్‌సింగ్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు ఆంజనేయరెడ్డి, వీరరాజు, వీరన్న, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ మహేందర్‌, బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్లు, బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement