మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పలు ఓపెన్‌జిమ్‌లు అధికారు ల నిర్లక్ష్యానికి గురై ప్రజలు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్లాట్‌ఫామ్ పగిలి పోయి విష సర్పాలకు నిలయంగా తయారయ్యాయి. పలు చోట్ల పరికరాలు చెడిపోయినా మరమ్మతులు, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. కాలనీల్లోని మరికొ న్ని జిమ్‌ల వద్ద విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగాయి. ఈ విషయమై మున్సిపల్ డీఈ సాయికిరణ్‌ను సంప్రదించగా.. పలు జిమ్ పరికరాల కోసం మరమ్మతుల కోసం ప్రతి పాదనలు పంపించామని తెలిపారు.


