లోటుపాట్లు లేకుండా భీం వర్ధంతి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

లోటుపాట్లు లేకుండా భీం వర్ధంతి ఏర్పాట్లు

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

● ప్రజలకు తగిన వసతులు కల్పించాలి ● కలెక్టర్‌ కె.హరిత ● ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పీవో మకరందుతో కలిసి అధికారులతో సమీక్ష

కెరమెరి: మండలంలోని జోడేఘాట్‌లో ఈ నెల 26 న నిర్వహించే ఆదివాసీ అమరుడు కుమురంభీం వ ర్ధంతికి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కె.హరిత అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌జిల్లా జోడేఘాట్‌లోని భీం మ్యూజియంలో శుక్రవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందుతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు, పురుషులకు వేర్వేరుగా భోజనశాలలు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలన్నారు. వేలాది మంది తరలి రానున్న నేపథ్యంలో ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వైద్యశిబిరాలు నిర్వహించడంతోపాటు 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసిఫాబాద్‌ డిపో నుంచి పది బస్సులు నడిపించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్‌శాఖ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు రావొద్దని, పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంలో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సభాస్థలితోపాటు హెలిప్యాడ్‌, స్టేజీ, స్మృతివనం, పార్కింగ్‌, భోజనస్థలాలు పరిశీలించారు. అంతకు ముందు కుమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన సమాధిపై పూలు చల్లారు. భీం మనుమడు కుమురం సోనేరావు, ఉత్సవ కమిటీ చైర్మన్‌ పెందోర్‌ రాజేశ్వర్‌, ఏపీవో వసంత్‌రావు, డీడీ అంబాజీ, అడిషనల్‌ డీఎంహెచ్‌వో మనోహర్‌, డీఎస్పీ అశోక్‌, సీఐ వేణుగోపాల్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement