మంచిర్యాలటౌన్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) పథకం కింద జిల్లాలోని ప్రభు త్వ ఆసుపత్రుల్లో 78 రకాల కేడర్లలో పనిచేస్తున్న 300మంది ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దుర్గామాత అవతారంలో చిన్నా రి చేసిన నృత్యం అలరించింది. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను మాతా చేతుల రూపంలో ఉంచి నిరసన వ్యక్తం చేశారు. పది రోజు లుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్వీపర్ల నుంచి డాక్టర్ల వరకు ఎన్‌హెచ్‌ఎంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా రెగ్యులరైజ్ చేయకపోవడం, వేతనాలను తగ్గించడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వల్లనే సమ్మెకు దిగామని తెలిపారు.


