పోరాట యోధుడు సాయన్న | - | Sakshi
Sakshi News home page

పోరాట యోధుడు సాయన్న

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: పెత్తందారులు, భూ స్వాములు, జమీందారి వ్యవస్థతోపాటు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ వీరుడు సాయన్నముదిరాజ్‌ అని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్‌ మా ట్లాడుతూ సమాజంలో పేదల కష్టాలను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేశారని, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సాయన్న సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం, సేవాభావం, పేదల పట్ల మానవత్వం పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతి రాం, సంక్షేమశాఖ అధికారులు నీరటి రాజేశ్వరి, దుర్గప్రసాద్‌, జెడ్పీ సీఈవో గణపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్‌, ముది రాజ్‌ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement