చదువుకోమని తండ్రి మందలించినందుకు.. | - | Sakshi
Sakshi News home page

చదువుకోమని తండ్రి మందలించినందుకు..

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

● ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

కాసిపేట: మంచిగా చదువుకోవాలని, కళాశాలకు వెళ్లాలని తండ్రి మందలించినందుకు ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కాసిపేట ఎస్సై ఆంజనేయులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ముత్యంపల్లికి చెందిన పాలగాని రాజన్న కుమారుడు విజయ్‌కుమార్‌(17) మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌స్కూల్‌/ఇంటర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. కళాశాలకు సక్రమంగా వెళ్లడం లేదని, చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని కుమారుడిని మందలించాడు. మనస్తాపం చెందిన విజయ్‌కుమార్‌ ఈనెల 16న ఇంట్లో చీరతో ఉరేసుకోగా, గమనించిన కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని కెల్వీన్‌ ఆస్పత్రికి పంపించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement