శ్రీరాంపూర్: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన శ్రీరాంపూర్ ఓసీపీని సందర్శించారు. క్వారీ వ్యూ పాయింట్ నుంచి మైనింగ్ కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం కొత్తగా కొనుగోలు చేసిన 6.5 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల లోడర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రోజువారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూనే లోటును భర్తీ చేయాలని, ఇందుకోసం ఉద్యోగులు, అధికారులు కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జీఎం కృష్ణప్రసాద్, ఓసీపీ పీఓ సీహెచ్.వెంకటేశ్వర్లు, మేనేజర్ ఐ.శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ ఎస్.సురేశ్, ప్రాజెక్టు ఇంజనీర్ నాగరాజు, సర్వేయర్ సంపత్‌రెడ్డి, క్వాలిటీ మేనేజర్ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.


