మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాను సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన, చేపట్టిన అభివృద్ధి పనులను జీఎం రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. కేకే–ఓసీ గనిలో పని ప్రదేశాలను పరిశీలించారు. ప్రమాదాలు జరుగకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలని ఉద్యోగులకు సూచించారు. కేకే–2 గని ఉపరితల భాగంలో ఇటీవల రెండు హెక్టార్ల విస్తీర్ణంలో నాటిన ఆయిల్‌పాం మొక్కలను పరిశీలించారు. పట్టణంలోని ప్రజలకు తాగునీరందించే ఉద్దేశంతో చెత్లాపూర్ వద్ద సింగరేణి నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన పంప్‌హౌజ్‌ను జీఎంతో కలసి ప్రారంభించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఎస్వో టూ జీఎం లలితేంద్రప్రసాద్, ఇంజనీర్ బాలాజీ భగవతీఝా, కేకే– ఓసీ పీవో రాంబాబు, కేకే గ్రూపు ఏజెంట్ ఖాదిర్, శాంతిఖని ఏజెంట్ సంతోష్‌కుమార్, డీజీఎం (పర్సనల్) అశోక్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


