దండేపల్లి: మండలంలోని తాళ్లపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు రోజు రోజుకు ముదురుతోంది. ఆదివారం బతుకమ్మ వేడుకల్లో రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం.. మంగళవారం దసర సంబరాల్లోనూ తలెత్తింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు, ఎంపీ వంశీకృష్ణ అనుచరుడు జగన్మోహన్రావు వర్గీయుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు వరుస వివాదాలతో ఉద్రిక్తంగా మారింది. రెండు మూడు కుటుంబాల మధ్య సాగుతున్న పార్టీ వర్గపోరుతో గ్రామస్తులు ప్రశాంతంగా పండుగ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామానికి చెందిన పేరం రజిత మంగళవారం తన తల్లిగారిల్లు ఆకుల రామయ్య ఇంటికి వెళ్లింది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బతుకమ్మ పండుగ రోజు జరిగిన ఘటనను గుర్తు చేశారు. ఇంతలో పక్క ఇంట్లో ఉండే కిరణ్, సురేష్ ఇనుపరాడ్‌తో ఆమైపె దాడికి యత్నించారు. రజిత సోదరుడు రాజేంద్రప్రసాద్, మేనల్లుడు అఖిరానందన్ అడ్డుకోవడంతో వారికి గాయాలయ్యాయి.
పోలీసు భద్రత
తాళ్లపేటలో రెండు వర్గాల ఘర్షణ నేపథ్యంలో పోలీ సులు మూడు రోజులుగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీసీపీ, ఏసీపీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, సుమారు 50 మంది పోలీసు సి బ్బంది విడతలవారీగా బందోబస్తు నిర్వహిస్తున్నా రు. అయినా మంగళవారం దాడులు జరిగాయి. ప రిస్థితులు చేయిదాటి పోకుండా మంగళవారం అర్ధరాత్రి వరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్ర కాశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, సిబ్బందిని అప్రమత్తం చేశారు.


