పోలీస్‌ అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

మంచిర్యాలక్రైం: ప్రజల రక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమర వీరుల స్థూపం వద్ద ప్రజల రక్షణ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో 154మంది ప్రాణాలు అర్పించారని కొనియాడారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడడంతోపాటు అన్ని విధాల భద్రత కల్పించేది పోలీస్‌ అధికారులేనని, వారి సేవలు అమోఘమని కొనియాడారు. ఎందరో పోలీస్‌ అధికారులు ప్రజల రక్షణలో ప్రాణాలు కోల్పోయారని వారి సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. పోలీస్‌ అమవీరుల కుటుంబాలకు పోలీస్‌ శాఖ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్‌, డీసీపీలు భాస్కర్‌, రామ్‌రెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement