బెల్లంపల్లి: పోలీసు అమరుల త్యాగాలు అజరామరమని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి ఏఆర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, పోలీసు అధికారులతో కలిసి అమరుల స్మారక స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, దేశ రక్షణలో ఏటా ఎందరో పోలీసులు ప్రాణాలను త్యాగం చేస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్న పోలీసులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు పోలీసు అమరుల జ్ఞాపకార్థం స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ సంపత్, బెల్లంపల్లి వన్‌టౌన్, రూరల్ సీఐలు కే.శ్రీనివాసరావు, సీ.హెచ్.హనోక్, టూటౌన్ ఎస్సై తిరుపతి, ఆర్ ఎస్సై మల్లేశం పాల్గొన్నారు.
బాధ్యతగా వ్యవహరించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): సమాజంలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని, వారి స్ఫూర్తితో విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని గుడిపేట 13వ ప్రత్యేక పోలీసు బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం గుడిపేటలోని బెటాలి యన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్స వం నిర్వహించారు. స్మృతి పరేడ్ అనంతరం అమరవీరుల స్థూపం ఎదుట పలు పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. కమాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విధుల్లో వారి బాధ్యత, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా, దేశసేవలో ముందుంటున్నామని తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోశ్‌సింగ్, బెటాలియన్ అధికారులు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


