‘గొప్ప పుణ్యక్షేత్రంగా గూడెం’ | - | Sakshi
Sakshi News home page

‘గొప్ప పుణ్యక్షేత్రంగా గూడెం’

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

దండేపల్లి: దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు తెలిపారు. మంగళవారం దసరా పండుగ రోజున ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ పునర్మిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.70 కోట్లు మంజూరు చేశారని, మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చే పుష్కరాల వరకు కొంత మేర పనులు జరుగుతాయని, వీలైనంత త్వరగా పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్‌, మంచిర్యాల మేయర్‌ మధుకర్‌, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆర్‌జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఏఎంసీ చైర్మన్‌ అక్కల వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ బిల్లకూరి శంకరయ్య, ఆలయ ఈవో శ్రీనివాస్‌, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు రఘుస్వామి, సంపత్‌స్వామి, వేదపండితులు నారాయణశర్మ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement