విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలి | - | Sakshi
Sakshi News home page

విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలి

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

మంచిర్యాలక్రైం: విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. మంగళవారం విజయదశమి వేడుకలను పురస్కరించుకుని కమిషనరేట్‌ ఆవరణలో దుర్గమాతకు పోలీస్‌ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బంది అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చి విజయాలు సొంతం చేసుకోవాలని అన్నారు. ప్రతీ ఆయుధానికి ఎంతో శక్తి ఉంటుందని అన్నారు. పోలీస్‌ శాఖలో ప్రతీ స్థాయిలోని అధికారులు ప్రజల రక్షణలో ముందుంటూ ఉన్నతాధికారులు, ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. పోలీస్‌ శాఖ గౌరవం మరింత పెరిగే విధంగా ఉండాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలని అన్నారు. అదనపు డీసీపీ శ్రీనివాస్‌ ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో..

విజయదశమిని పురస్కరించుకుని మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement