మందమర్రిరూరల్: పట్టణంలోని విద్యానగర్‌లోని రాజన్నల వాడకు చెందిన మద్దెల విజయలక్ష్మి, నాగయ్య దంపతుల కుమారుడు ప్రశాంత్ బీఆర్‌ఏఓయూ 27వ స్నాతకోత్సవంలో బంగారు పతకం సాధించాడు. బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులోని అన్ని సబ్జెక్టులు ఒకేసారి పూర్తిచేసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. బుధవారం హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రంతో పాటు బంగారు పతకం అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వశాఖలో గెజిటెడ్ అధికారి హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు.


