అంబులెన్స్‌ నిర్వాహకుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ నిర్వాహకుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

మంచిర్యాలటౌన్‌: అంబులెన్స్‌ మాఫియా, దోపిడీ పాయింట్‌ సిస్టంపై ఉక్కుపాదం మోపాలని, ఆగడాలపై కఠిన చర్యలు తీసుకో వాలని హెల్త్‌ కేర్‌ రిఫార్‌మ్స్‌ డాక్టర్‌ అసోసియేషన్‌(హెచ్‌ఆర్‌డీఏ) ఆధ్వర్యంలో మంచి ర్యాల డీసీపీ భాస్కర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. సిండికేట్‌ కింద ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు అత్యవసర రవా ణాను గుత్తాధిపత్యం చేసి అత్యంత ప్రమాదకరమైన, నిస్సహాయ వైద్య, పేద కుటుంబా ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. రోగులను వేధించే, అధిక చార్జీలు వసూలు చేసే అంబులెన్సు నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ అంబులెన్సు సేవలను బలోపేతం చేసి పేదలకు ఉచిత, సత్వర రవాణా అందించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎంసీ సభ్యుడు ఎగ్గన శ్రీనివాస్‌, టీజీఎంసీ కోఆప్షన్‌ సభ్యుడు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ముత్తినేని, హెచ్‌ఆర్‌డీఏ జిల్లా అధ్యక్షు డు డాక్టర్‌ సంతోష్‌చందూరి, సెక్రెటరీ డాక్టర్‌ శ్రీధర్‌, ట్రెజరర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ బుద్దె, వైద్యులు రాకేశ్‌ చెన్న, అభినవ్‌, ప్రసాద్‌, కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement