మంచిర్యాలక్రైం: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ ఎ లైట్ యాంటీ–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ ఎన్‌ఫో ర్స్‌మెంట్(ఈగల్) గురువారం జిల్లా కేంద్రంలో తెల్లకల్లు బట్టీలు, దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌కు చెందిన ఈగల్ టీమ్ ఏసీపీ ఉపేందర్, 10 మంది అధికారులు స్థానిక ఏసీపీ ప్రకాష్, స్పెషల్ ఫో ర్స్ సిబ్బంది 50 మందితో మంచిర్యాలలోని ఏడు తెల్లకల్లు దుకాణాల్లో తనిఖీ చేశారు. మూడు గంటలపాటు సాగిన తనిఖీల్లో కల్లు తయారీ, ఎక్కడి నుంచి సరుకు వస్తుందని, మత్తు రసాయనాలు ఏమైనా కలుపుతున్నారా అని ప్రశ్నించారు. దుకాణాల్లోని కల్లు నమూనాలు సేకరించారు. దుకాణాల నిర్వాహకుల ను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బట్టీ నిర్వాహకుడు లచ్చిరెడ్డితోపాటు ఏడు కల్లు దుకాణాల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.


