డప్పు కొట్టి.. పాడె మోసిన మాజీ ఎమ్మెల్యేలు | - | Sakshi
Sakshi News home page

డప్పు కొట్టి.. పాడె మోసిన మాజీ ఎమ్మెల్యేలు

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

మందమర్రిరూరల్‌: బీఆర్‌ఎస్‌ నాయకుడు జే.రవీందర్‌ అంతిమ యాత్రలో చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, నల్లాల ఓదెలు డప్పుకొట్టి, పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు జే.రవీందర్‌ బుధవారం అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. గురువారం అంత్యక్రియలు నిర్వహించగా.. బాల్క సుమన్‌, నల్లాల ఓదెలు పాల్గొన్నారు. అంతిమయాత్రలో డప్పు కొట్టి పాడె మోసి ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, పార్టీలకతీతంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement