మంచిర్యాలటౌన్: పేదల భూములు దోచుకునేందుకు 22ఏ నిషేధిత భూముల జాబితాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. 22ఏ నిషేధిత జాబితా బాధితుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను గురువారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందజేశారు. పట్టా ఉన్న నివాస, వ్యవసాయ భూములు జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య, గడ్డం స్వామిరెడ్డి, నాగిరెడ్డి, హేమంత్‌రెడ్డి, సుగుణ, సంజీవ్, సురేష్, వెంకటేశ్, సంతోష్, సురేందర్, బత్తుల శేఖర్, ముత్తె అనిల్ పాల్గొన్నారు.


