కాసిపేట: కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ పేలుళ్లతో బెల్లంపల్లి మండలం సోమగూడంలో కూలిపోయిన ఇంటిని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు అధికారి రాంబాబు గురువారం పరిశీలించారు. కూలీన గోడలు, దెబ్బతిన్న నిర్మాణాలను స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు చూపించి పరిస్థితిని వివరించారు. బాధిత కుటుంబానికి సింగరేణి ఆధ్వర్యంలో తిరిగి నిర్మాణం చేపట్టా లని కోరారు. స్పందించిన పీఓ జేసీబీతో కా లువలో పడిపోయిన బండరాళ్లు, ఇటుకలు, మట్టిని తీయించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కాలువను వినియోగంలోకి తీసుకు వ చ్చేందుకు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మౌనిక, నాయకులు ముత్తె భూమయ్య, మహేష్, కనకరాజు, శ్రీనివాస్, సురేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


