బాసర: బాసర ఆర్జీయూకేటీలోని సైకలాజికల్ వెల్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 11 వరకు ‘హోప్ అండ్ వెల్‌నెస్ వీక్ 2026’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక ఆరో గ్యం, భావోద్వేగ సమతుల్యత, ఆత్మవిశ్వాసం, ఆ శావాదాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వివిధ కా ర్యక్రమాలు చేపట్టారు. వాల్ ఆఫ్ పాజిటివిటీ, ఎ ల్లో రిబ్బన్ క్యాంపెయిన్, ‘ఆర్ యూ ఓకే?’ కార్యక్రమాలతోపాటు యోగా, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, డిజి టల్ డిటాక్స్ చాలెంజ్, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువా రం న్యూరోసైకియాట్రిస్ట్ డాక్టర్ అల్లాడి సురేశ్ వి ద్యార్థులకు మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్ ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. పీయూసీ–1, పీ యూసీ–2 విద్యార్థులు అవగాహన వాక్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శుక్రవారం ఎస్‌ఏసీ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలతో వారోత్సవాలు ముగియనున్నాయి. ‘యూ ఆర్ నాట్ అలోన్ – టాక్, కనెక్ట్, సీక్ సపోర్ట్ అండ్ చూజ్ హోప్’ అనే సందేశాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమా ల ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఏఓ మురళీధర్, డీన్ డాక్టర్ విఠల్, స్టూడెంట్ వెల్ఫేర్ జి. నాగరాజు, అడిషనల్ ఎస్‌డబ్ల్యూవో ప్రకాశ్, అడిషనల్ చీఫ్ వార్డెన్ డాక్టర్ శ్రీనివాస్, చీఫ్ వార్డెన్ టి.మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు, కోఆర్డినేటర్లు, సైకలాజికల్ వెల్‌నెస్ సెంటర్ బృందం పాల్గొన్నారు.


